Home > తెలంగాణ > ముగిసిన తొలి కేబినెట్ మీటింగ్.. ఏం చర్చించారంటే..?

ముగిసిన తొలి కేబినెట్ మీటింగ్.. ఏం చర్చించారంటే..?

ముగిసిన తొలి కేబినెట్ మీటింగ్.. ఏం చర్చించారంటే..?
X

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 64 స్థానాల్లో భారీ విజయం సాధించింది. రేవంత్ రెడ్డి సీఎంగా, భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా.. పలువురు ముఖ్యనేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా తెలంగాణ సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ కేబినెట్ మీటింగ్ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు సమావేశమయ్యారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై చర్చించారు. ఆరు గ్యారెంటీలను, ప్రజలకు ఇచ్చిన హామీలను రానున్న 100 రోజుల్లో అమలయ్యేలా చూస్తామని చెప్పారు. తొలి మీటింగ్ లోనే మంత్రులంతా ప్రజలకు ఇచ్చిన హామీ అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రమాణ స్వీకారం సమయంలోనే.. అభయ హస్తం పేరు.. గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే.




Updated : 7 Dec 2023 8:04 PM IST
Tags:    
Next Story
Share it
Top