ధరణి పోర్టల్‌పై కీలక నిర్ణయం..ఐదు కొత్త మాడ్యూళ్లు
X
ధరణి పోర్టల్‌పై విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రికార్డుల నమోదు మరింత సులభం చేయాలని నిర్ణయించింది. సైట్‌లో ఐదు కొత్త మాడ్యూళ్లు తీసుకొచ్చింది. లాగిన్ విషయంలో కొన్ని కలెక్టర్, కొన్ని తహశీల్దార్ సమక్షంలో నిర్వహించే వీలు కల్పించింది. ఆధార్ కార్డు నంబర్లలో తప్పులు దొర్లివుంటే తలహీల్దార్ మార్పు చేయొచ్చు. భూమి అమ్మకం కేసులో అమ్మిన భాగాన్ని గుర్తించేందు కలెక్టర్ లాగిన్ అయి, సర్వే నంబర్లు కేటాయిస్తారు.
భూవినియోగంలో మార్పులు, సర్వే నంబర్ లేని ఇంటి స్థలాలకు, ప్రభుత్వ భూముల గుర్తింపు ఈ మార్పులు దోహదపడతాయి. వివిధ సంస్థలకు చెందిన పట్టా భూముల వివరాల్లో తప్పులు ఉన్నా కలెక్టర్లు మార్పులు చేస్తారు. ధరణి పోర్టల్లో ఏ మార్పులు చేయాలన్నా పూర్తి అధికారం కలెక్టర్లకే ఉందన్నసంగతి తెలిసిందే. వారికి పని ఒత్తిడి పెరడంతో లక్షల దరఖాస్తుల పెండిగులో పడుతున్నాయి. రిజెక్ట్ అవుతుండండతో రైతుల మళ్లీ ఫీజు కట్టి కట్టి కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో కొన్ని మార్పులు చేసే అవకాశాన్ని తహసీల్దార్లకు కట్టబెట్టారు. ఫేక్ సర్వే నంబర్లు, సబ్డివిజన్ నంబర్లను తహసీల్దార్లు లాగిన్ అయి కలెక్టర్ ఆమోదంతో తొలగించవచ్చు. ఆధార్, ఆన్సైన్ ఖాతా విషయాల్లోనూ తహసీల్దార్ నిర్ణయం తీసుకోచ్చు. పట్టాదార్ పాస్ పుస్తకాల్లో మార్పులు, అమ్మకం కేసుల్లో కలెక్టర్ మార్పులు చేస్తారు.
కొత్తగా తీసుకొచ్చిన మాడ్యూళ్లు
* ఫిక్టీషియస్ సర్వే, సబ్ డివిజన్ నంబరు రద్దు
* ఆర్గనైజేషన్ పీపీబీ మార్పులు
* ఆధార్ మార్పు
* మిస్సింగ్ సర్వే నంబర్ నోషనల్ ల్యాండ్స్
* సోల్డ్ ఔట్ కేసుల రద్దు