Home > తెలంగాణ > KTR : కేటీఆర్ చొరవ.. 18 ఏండ్ల జైలు జీవితం తర్వాత స్వదేశానికి సిరిసిల్ల వాసులు

KTR : కేటీఆర్ చొరవ.. 18 ఏండ్ల జైలు జీవితం తర్వాత స్వదేశానికి సిరిసిల్ల వాసులు

KTR : కేటీఆర్ చొరవ..  18 ఏండ్ల జైలు జీవితం తర్వాత స్వదేశానికి సిరిసిల్ల వాసులు
X

దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు విముక్తి (Telangana Residents released) లభించింది. గత 18 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న 5 గురు సిరిసిల్ల జిల్లా వాసులు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మేల్యే కేటీఆర్ చొరవతో విడుదలయ్యారు. వివరాలివి.. చందుర్తి మండలానికి చెందిన ఒక్కరు గోళం నాంపల్లి, శివరాత్రి హనుమండ్లు, కొనరావుపేట గ్రామానికి చెందిన దండుగుల లక్ష్మణ్ దుబాయ్ కి వెళ్ళారు. వెళ్లిన ఆరు నెలల అనంతరం నేపాల్ కు చెందిన బహదూర్ సింగ్ అనే వాచ్మెన్ హత్యకు గురయ్యాడు. అక్కడే పని చేస్తున్న జిల్లా వాసులు ఈ ఐదుగురు కేసులో ఇరుక్కున్నారు. భాష సరిగా రాకపోవడంతో పోలీసులకు ఏం చెప్పారో తెలియదు కానీ శిక్ష రుజువు కావడంతో దుబాయ్ కోర్టు మొదట పదేళ్లు జైలు శిక్ష వేశారు. అనంతరం అప్పిలుకు వెళ్ళగా 25 ఏళ్ల శిక్ష విధించింది. దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే విడుదల అవకాశం ఉండగా 2011లో ఎమ్మెల్యే కేటీఆర్ చొరవ తీసుకొని ఒకసారి నేపాల్ కూడా వెళ్లి వచ్చారు.

నేపాల్ కు చెందిన బహదూర్ కుటుంబ సభ్యులతో లాయర్ అనురాధ, ఇతర ప్రతినిధుల సహకారంతో క్షమాభిక్ష పై సంతకాలు చేయించారు. వారికి ఆర్థికంగా కేటీఆర్ పదిహేను లక్షల రూపాయల చెక్కును అందించారు. అప్పుడే దుబాయ్ లో చట్టాలు మారడంతో చందుర్తి మండల వాసులు విడుదల గగనమైంది. మారిన నిబంధనలతో కోర్టు అంగీకరించలేదు. వీరి క్షమాభిక్ష పిటిషన్ దుబాయ్ కోర్టు కొట్టి వేసింది. సెప్టెంబర్ లో మంత్రి కేటీఆర్ దుబాయ్ కోర్టులో బాధిత కుటుంబ సభ్యులతో మళ్ళీ కేసు వేయించడం, కేంద్ర విదేశాంగ శాఖ సహకారంతో దుబాయ్ రాజు అపాయింట్మెంట్ సాధించి ఈ కేసులో క్షమాభిక్ష కోరడం కోసం మంత్రి దుబాయ్ లో అక్కడి అధికారులతో సమీక్షించారు. దీంతో దుబాయ్‌ నుంచి సిరిసిల్ల ,రుద్రంగి, కొనరావుపేట మండలానికి చెందిన ఐదుగురు హైదరాబాద్‌ వచ్చారు. 18ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భావోద్వేగ వాతావరణం నెలకొంది. జైల్లో ఉన్న తమ కుటుంబసభ్యులని తీసుకురావడానికి మాజీ మంత్రి కేటీఆర్ అనేక ప్రయత్నాలు చేశారని, వారికి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు

Updated : 21 Feb 2024 5:49 AM GMT
Tags:    
Next Story
Share it
Top