Home > తెలంగాణ > వరద నీటిలో చిక్కుకున్న ప్రైవేట్ హాస్టల్.. ఆందోళనలో విద్యార్థులు

వరద నీటిలో చిక్కుకున్న ప్రైవేట్ హాస్టల్.. ఆందోళనలో విద్యార్థులు

వరద నీటిలో చిక్కుకున్న ప్రైవేట్ హాస్టల్.. ఆందోళనలో విద్యార్థులు
X

కుండపోత వర్షాలతో హైదరాబాద్లో జన జీవనం అస్తవ్యస్థమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో అపార్ట్ మెంట్ సెల్లార్లలో వర్షపు నీరు నిండిపోయింది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ వరద నీటిలో మునిగిపోయింది. దీంతో అందులో ఉంటున్న ఇంజనీరింగ్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.





మైసమ్మగూడలోని దాదాపు 15 అపార్ట్మెంట్లలోకి వరద నీరు చేరడంతో అందులో నివసిస్తున్న జనం బయట అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. వర్షపు నీరు భారీగా చేరడంతో ఆ ప్రాంతం చెరువును తలపిస్తోంది. హాస్టల్ బిల్డింగ్ నీట మునగడంతో ఆందోళన చెందుతున్న విద్యార్థులను అధికారులు ప్రొక్లెయినర్ల సాయంతో బయటకు తీసుకువచ్చారు. చెరువులు, నీటి కుంటలు కబ్జా చేసి బిల్డింగ్ లు కట్టడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని స్థానికులు అంటున్నారు.




Updated : 5 Sept 2023 4:08 PM IST
Tags:    
Next Story
Share it
Top