ముగిసిన సాయిచంద్ అంత్యక్రియలు
X
గాయకుడు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. వనస్థలిపురం సాహెబ్‌నగర్ శ్మశాసనవాటికలో అంత్యక్రియలను నిర్వహించారు. సాయిచంద్ చితికి అతడి కుమారుడు నిప్పటించాడు. సాయిచంద్‌కు తుది వీడ్కోలు పలికేందుకు భారీగా కళాకారులు, అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు, కుటుంబ సభ్యులు తరలివచ్చారు. జోహర్ సాయిచంద్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. అంత్యక్రియలకు మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
జూన్ 28 సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లాలోని తన ఫామ్‌హౌస్‌కు సాయిచంద్ వెళ్లాడు. అర్థరాత్రి సమయంలో అతడు గుండెపోటు రావడంతో నాగర్ కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. జూన్ 29 గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సాయి చంద్ కన్నుమూసినట్ల వైద్యులు నిర్ధారించారు.