ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్‌లకు భద్రత పెంపు..
X
తెలంగాణ బీజేపీ కీలక నేతలు ఈటల రాజేందర్ (MLA Etela Rajender), ధర్మపురి అర్వింద్‌లకు (MP Dharmapuri Arvind) కేంద్రం భద్రతను కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువురు నేతలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు సీఆర్పీఎఫ్ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటలకు ‘వై’ ప్లస్ భద్రతను కేటాయించగా....ధర్మపురి అర్వింద్‌కు “వై కేటగిరి”ని కేటాయించింది. భద్రతతోపాటు ఈ ఇద్దరికీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కేటాయించారు. ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు 11 మందితో భద్రతా సిబ్బంది రక్షణగా ఉండనున్నారు. నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కి ఒక కమాండోతో సహా 8 మంది భద్రతా సిబ్బంది రక్షణగా ఉంటారు.
తన భర్తను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఈటల భార్య జమున, అలాగే, తనకు ప్రాణహాని ఉందని స్వయంగా ఈటల మీడియా సమావేశంలో వెల్లడించిన సంగతి విదితమే. అలాగే, తనకు ప్రాణహాని ఉందని స్వయంగా ఈటల రాజేందర్ కూడా వెల్లడించారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వారికి భద్రతను కల్పించింది.