CP Srinivas Reddy : సీపీ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం.. పోలీస్ స్టేషన్లోని అందరూ బదిలీ
X
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని మొత్తం సిబ్బందిని బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. స్టేషన్ లోని పలు కీలకమైన సమాచారాలు బయటికి పొక్కడంపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ లోని ఎస్ఐ నుంచి హోంగార్డు వరకు అందరిని ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ నుంచి కొత్త సిబ్బందిని పంజాగుట్టకు నియామిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ పోలీసుశాఖ చరిత్రలో ఇలాంటి నిర్ణయం తీసుకొవడం ఇదే తొలిసారి. స్టేషన్ లోని పలు కీలక సమాచారం బయటికి రావడం పట్ల తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలకు సమాచారాన్ని అందిస్తున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అవినితీ ఆరోపణలు, మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసును పక్క తోవ పట్టించారని సీరియస్ అయ్యారు.. దీంతో స్టేషన్ లోని మొత్తం 85 మందిని బదిలీ చేస్తున్నట్లు తెలిపారు సీపీ శ్రీనివాస్ రెడ్డి.