Home > తెలంగాణ > ట్రాన్స్‎జెండర్లకు ప్రత్యేకం..ఉస్మానియాలో ఫస్ట్ క్లినిక్

ట్రాన్స్‎జెండర్లకు ప్రత్యేకం..ఉస్మానియాలో ఫస్ట్ క్లినిక్

ట్రాన్స్‎జెండర్లకు ప్రత్యేకం..ఉస్మానియాలో ఫస్ట్ క్లినిక్
X

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లకు ఓ శుభవార్త చెప్పింది. వారికోసమే ప్రత్యేకంగా వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‎లో ఓ క్లినిక్‎ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతానికి ఈ క్లినిక్ మాత్రం వారానికి ఒకసారి మాత్రమే వారికి అందుబాటులో ఉండనుంది. ఇది ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 12 గంటల వరకు వైద్య సేవలు అందిస్తుంది. ఆస్పత్రికి వచ్చే ట్రాన్స్ జెండర్ల సంఖ్యను బట్టి భవిష్యత్తులో మరిన్ని పనిదినాలను పెంచాలని అధికారులు భావిస్తున్నారు. సెన్సిటైజేషన్ శిక్షణ పొందిన డాక్టర్లు ట్రాన్స్‌జెండర్లకు విస్తృతమైన వైద్య చికిత్సలను అందిస్తారు. ఉస్మానియా వంటి ఆస్పత్రిలో తమకోసం ప్రత్యేకంగా వైద్య సేవలు అందించడం పట్ల ట్రాన్స్‎జెండర్లు హర్షం వ్యక్తం చేశారు.





ఈ క్లినిక్‌లో, ఇద్దరు ఎండోక్రినాలజిస్టులు అందుబాటులో ఉండనున్నారు. లింగమార్పిడి చేసిన వారికి హార్మోన్ల చికిత్స తో పాటు ఇతర అవసరమైన వైద్య సేవలు అందిస్తారు. గైనకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, సైకియాట్రీ, యూరాలజీ, వంటి విభాగాలు అవసరమైనప్పుడు తమ సహాయాన్ని అందించనున్నాయి. ఈ నిపుణుల వైద్య బృందంతో పాటు ప్రభుత్వ సర్వీసులో చేరిన తెలంగాణ తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్లను క్లినిక్‏లో సమన్వయకర్తలుగా నియమించారు.









Updated : 6 July 2023 2:53 PM IST
Tags:    
Next Story
Share it
Top