Home > తెలంగాణ > లోకేష్‌ కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేసే ప్రయత్నం.. కొడాలి నాని

లోకేష్‌ కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేసే ప్రయత్నం.. కొడాలి నాని

లోకేష్‌ కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేసే ప్రయత్నం.. కొడాలి నాని
X

లోకేష్‌ కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు తొలగింపుపై ఆయన స్పందిస్తూ.. వాళ్లది నీచాతినీచమైన బుద్ధి. వెయ్యిమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఏం చేయలేరు. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ఏమీ చేయలేరు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వారు ఎన్టీఆర్‌ వర్ధంతి చేస్తారా?’’ అంటూ కొడాలి నాని మండిపడ్డారు.

అయితే.. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా నందమూరి ఫ్యామిలీలో విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుమారులు, మనవళ్లు, ఇతర కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ముందుగా జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళులర్పించారు. ఆ తర్వాత బాలకృష్ణ, రామకృష్ణలు ఘాట్ వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అయితే ఘాట్ వద్ద సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్‌లతో పాటు హరికృష్ణ, కల్యాణ్ రామ్‌ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలని జూ.ఎన్టీఆర్ అభిమినాలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను తొలగించారు బాలకృష్ణ అనుచరులు. బాలకృష్ణ ఆదేశాల మేరకే ఫ్లెక్సీలు తొలగించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ వచ్చి వెళ్లిన మరుక్షణమే ఫ్లెక్సీలు తొలగించారు. అయితే.. బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందని.. బాలకృష్ణ చెబితేనే ఫ్లెక్సీలు తొలగించారనే ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీనిపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇటీవల స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. నందమూరి కుటుంబం మెుత్తం చంద్రబాబుకు అండగా నిలిచినా.. జూ.ఎన్టీఆర్ మాత్రం రియాక్ట్ కాలేదు. దీంతో అప్పటి నుంచి చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెరిగిందనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వాదనకు బలం చేకూరేలా ఎన్టీఆర్ ఘాట్‌కు బాలకృష్ణ వచ్చి వెళ్లగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం వివాదాస్పదమవుతోంది.

Updated : 18 Jan 2024 7:03 AM GMT
Tags:    
Next Story
Share it
Top