Home > తెలంగాణ > తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం.. జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం.. జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం.. జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
X

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రాజకీయ కురు వృద్ధుడు, జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే బింగి మశ్చేందర్ రావు (95) కన్నుమూశారు. అల్వాల్ లోని ఆయన స్వగృహంలో వయోభారంతో శుక్రవారం (జనవరి 26) రాత్రి తుది శ్వాస విడిచారు. 1934లో అల్వాల్ లో జన్మించిన ఆయన.. 1969-73 వరకు హైదరాబాద్ జువైనల్ మేజిస్ట్రేట్ కోర్టులో జడ్జిగా పని చేశారు. అయితే ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. 1978-83 మధ్య జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యే పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి.. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

తర్వాత మశ్చేందర్ రావు సిండికేట్ బ్యాంక్ డైరెక్టర్ గా, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఇండియా డైరెక్టర్‌, హైదరాబాద్‌ టెలికాం సభ్యుడు, ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ జువైనల్‌ కోర్టు సభ్యుడిగానూ పనిచేశారు. ప్రజల సమస్యలపై పోరాడి సాధించిన ఘనత మశ్చేందర్ రావుకి ఉంది. రాజకీయాలకు దూరమైన ఆయన.. అల్వాల్ లో 200 గజాల స్థలంలో నిర్మించుకున్న చిన్న ఇంటిలో సాధారణ జీవితం గడిపారు. మశ్చేందర్ రావుకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కాగా కుమారుడు గతంలోనే చనిపోగా.. ఆయన సతీమణి పద్మావతి ఇటీవలే మరణించారు.

Updated : 27 Jan 2024 1:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top