Home > తెలంగాణ > మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకుపై భూకబ్జా కేసు

మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకుపై భూకబ్జా కేసు

మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకుపై భూకబ్జా కేసు
X

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్లు తేజేశ్వర్‌రావు (కన్నారావు)పై కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో రెండు ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఒఎస్‌ఆర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఫెన్సింగ్ తొలిగించి హద్దు రాళ్లు పెట్టినట్లు పేర్కొన్నారు. దీంతో కన్నారావుతో పాటు అతని అనుచరులు బీఆర్‌ఎస్ నాయకులు మొత్తం 38 మందిపై కేసు నమోదు చేశారు.

ఐపీసీ సెక్షన్లు 307, 447, 427, 436, 148, 149 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఫెన్సింగ్ రాళ్లను తొలగించి, హద్దు రాళ్లను పెట్టినట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. 38 మందిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 35 మంది పరారీలో ఉన్నారు. కన్నారావు ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

Updated : 14 March 2024 1:03 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top