Home > తెలంగాణ > Praneet Rao : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు..మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదు

Praneet Rao : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు..మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదు

Praneet Rao  : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు..మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదు
X

విశ్రాంత డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదైంది. ప్రభుత్వ రహస్యాలను ఇతర చేరవేశారనే ఆరోపణలతో సర్కార్ ఆయన్ను ఇటీవల సస్పెండే చేసింది. విచారణలో ప్రణీత్‌రావు ప్రత్యేకంగా 17 కంప్యూటర్స్ ఏర్పాటు చేసుకుని రహస్య సమాచారం సేకరించినట్లు అధికారులు గుర్తించారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఆధారాలు తారుమారు చేసినట్లు తేల్చారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపక్ష నేతల ఫోన్లు టాప్ చేసి రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆ డేటా మొత్తం డిలీట్ చేసినట్లు ప్రణీత్ రావుపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రణీత్ రావు వ్యవహారంపై సీరియస్ అయిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇదిలా ఉండగా.. తాజాగా ప్రణీత్ రావుపై కేసు నమోదు అయ్యింది.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐబీ ప్రణీత్ రావుపై ఫిర్యాదు చేసింది. ఎస్ఐబీ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదు చేశారు. ప్రణీత్ రావుతో పాటు మరికొందరిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఎస్ఐబీ ఆఫీస్‌లో కీలక సమాచారాం ఉన్న హార్డ్ డిస్క్‌లు.. కంప్యూటర్లను ప్రణీత్ రావు ధ్వంసం చేశాడని ఎస్ఐబీ ఫిర్యాదులో పేర్కొంది. ప్రణీత్ రావుతో పాటు అతడికిసహకరించిన అధికారులపై కేసు నమోదైంది. ప్రణీత్ రావు మీద ఐపీసీ 409, 427, 201, 120(బీ), పీడీపీపీ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద కేసు ఫైల్ అయ్యింది. ఎలక్ట్రీషియన్​ సాయంతో ఎస్​ఐబీ భవనంలో సీసీ కెమెరాలు ఆఫ్​చేయించి హార్ట్​డిస్కులు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.కాగా, విచారణ పూర్తయ్యే వరకూ అనుమతి లేకుండా డీఎస్పీ ప్రణీత్​హెడ్​క్వార్టర్స్‌​ను వీడకూడదని సస్పెన్షన్​ఆర్డర్‌​లో స్పష్టం చేశారు. కుట్రలో భాగంగానే సమాచారం మొత్తం ధ్వంసం చేసినట్లు గుర్తించిన పోలీసు శాఖ.. ప్రణీత్ రావుపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.




Updated : 10 March 2024 11:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top