Home > తెలంగాణ > రూ.300కోట్లకు పైగా అక్రమాస్తులు.. HMDA మాజీ డైరెక్టర్ అరెస్ట్..

రూ.300కోట్లకు పైగా అక్రమాస్తులు.. HMDA మాజీ డైరెక్టర్ అరెస్ట్..

రూ.300కోట్లకు పైగా అక్రమాస్తులు.. HMDA మాజీ డైరెక్టర్ అరెస్ట్..
X

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ఇవాళ కోర్టులో హజరుపరచనున్నారు. శివ బాలకృష్ణ ఇంట్లో నిన్న మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఏసీబీ సోదాలు నిర్వహించింది. మొత్తం 14 టీమ్స్ శివ బాలకృష్ణ బంధువులు సహా ఆయనకు ఆస్తులు ఉన్న పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు ఆయనకు భారీగా ఆస్తులున్నట్లు గుర్తించారు. రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులను అధికారులు గుర్తించారు.

ఆయనకు కోట్ల రూపాయలు విలువ చేసే 75 ఎకరాల భూములు ఉన్నట్లు ఏసీబీ తనిఖీల్లో బయటపడింది. పుప్పాలగూడలోని ఆయన ఇంట్లో రూ.84లక్షల క్యాష్, ఖరీదైన వాచీలు, 2 కిలోల బంగారాన్ని స్వాధీనం ఏసీబీ స్వాధీనం చేసుకుంది. 14 ఫోన్లు, 10 ల్యాప్​టాప్​లను సైతం సీజ్ చేశారు. అంతేకాకుండా బినామీల పేరుతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. సుమారు 75 ఇక ఇవాళ శివబాలకృష్ణకు చెందిన బ్యాంకు లాకర్లను ఏసీబీ తెరిచే అవకాశం ఉంది. లాకర్లు తెరిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంది. శివ బాలకృష్ణ ప్రస్తుతం రెరా సెక్రటరీగా పనిచేస్తున్నారు.

Updated : 25 Jan 2024 7:32 AM IST
Tags:    
Next Story
Share it
Top