Home > తెలంగాణ > HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ భూమార్పిడి ఉత్తర్వులపై సర్కార్ ఫోకస్

HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ భూమార్పిడి ఉత్తర్వులపై సర్కార్ ఫోకస్

HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ భూమార్పిడి ఉత్తర్వులపై సర్కార్ ఫోకస్
X

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన రెరా కార్యదర్శి,హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఏసీబీ సోదాల నేపథ్యంలో ఆయన కనుసన్నల్లో ఆమోదం పొందిన ఫైల్స్‌పై సర్కార్‌పై ఫోకస్ పెట్టింది.హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా పనిచేసిన బాలకృష్ణ.. ఆరు నెలల క్రితమే రెరాకు ట్రాన్స్ఫర్ అయ్యారు. భూ మార్పులు, పంచాయితీల్లో తన అధికారాన్ని ఉపయోగించుకొని కోట్లు కూడబెటినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు రెరాలో శివబాలకృష్ణ పాత్ర ఏ మేరకు ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రధానంగా వట్టినాగులపల్లికి సంబంధించి పెద్దఎత్తున భూవినియోగ మార్పిడి ఉత్తర్వులు వెలువడే సమయానికి శివబాలకృష్ణ హెచ్‌ఎండీఏలో, పురపాలక శాఖలో అధికారికంగా లేకపోయినా ఆయన పాత్రపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల ఆమోదం తదితర అంశాలపై దస్త్రాలను స్థూలంగా పరిశీలించేందుకు ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దీనిపై సాంకేతిక కమిటీని నియమించే అవకాశం ఉందని సమాచారం.

తాజా సోదాల నేపథ్యంలో శివబాలకృష్ణకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే ఓ కన్సల్టెంట్‌పైనా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. రెండేళ్ల కిందటే శివబాలకృష్ణపై ఏసీబీ అధికారులకు కంప్లైంట్స్ వచ్చాయి. అప్పట్లో ఆయన ఉన్నతస్థాయిలో ఒత్తిడి తేవడంతో ముందడుగు పడలేదన్న ప్రచారం ఉంది. తాజా తనీఖీల నేపథ్యంలో శివబాలకృష్ణకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే ఓ కన్సల్టెంట్‌పైనా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 4 జోన్లు ఉంటే మూడో వంతు జోన్లు శివబాలకృష్ణ వద్దే ఉండేవి. ఈ జోన్ల కేటాయింపుతో పలువురికి విస్తృత ప్రయోజనాలున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన పర్యవేక్షణలో ఉన్న జోన్లలో సింహభాగం ప్రస్తుతం విలువైన ప్రాంతాలుగా ఉన్నాయి. అక్కడ ఎకరం రూ.పదుల కోట్లలో పలుకుతోంది. ఆయా ప్రాంతాల్లో నిర్మాణ అనుమతులే కాదు లే అవుట్లకు ఆమోదంలోనూ శివబాలకృష్ణే కీలకమని తెలుస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియమావళికి కొద్దిరోజుల ముందు వట్టినాగులపల్లి పరిసరాల్లో భూవినియోగ మార్పిడి ఉత్తర్వుల జారీ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.

Updated : 27 Jan 2024 6:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top