Home > తెలంగాణ > BRSకు బిగ్ షాక్... BJPలోకి మాజీ మంత్రి కొడుకు!!

BRSకు బిగ్ షాక్... BJPలోకి మాజీ మంత్రి కొడుకు!!

BRSకు బిగ్ షాక్... BJPలోకి మాజీ మంత్రి కొడుకు!!
X

రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే సీటు దక్కకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్త నాయకులు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇలా ఇప్పటికే పలువురు నాయకులు బిఆర్ఎస్ కు రాజీనామా చేయగా మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ తనయుడు అజ్మీరా ప్రహ్లాద్ కూడా అదేబాటలో నడుస్తున్నారు. ప్రహ్లాద్ బిఆర్ఎస్‌ను వీడి.. బీజేపీలో చేరడానికి సిద్దమైనట్లు... ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు సమాచారం.





ఈనెల 12న డాక్టర్‌ అజ్మీరా ప్రహ్లాద్‌ బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఆ రోజు ములుగులో 20 వేల మందితో భారీ బహిరరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సభలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌, ఎస్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జి గరికపాటి మోహన్‌రావు సమక్షంలో ప్రహ్లాద్‌ కాషాయ కండువా కప్పుకోనున్నారు.





2018 అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి అజ్మీరా చందూలాల్‌ ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌లో తనకు ప్రాధాన్యం తగ్గించారని ఆయన తీవ్ర నిరాశలో ఉన్నారు. అయినప్పటికీ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్‌ తనకే వస్తుందని భావించారు. అనూహ్యంగా ఆదివాసీ మహిళ అయిన జడ్పీ చైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతిని బీఆర్‌ఎస్‌ ములుగు అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రహ్లాద్‌ మనస్తాపానికి గురయ్యారు. చివరకు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ములుగు ఎమ్మెల్యేగా సీతక్క ఉన్నారు. ఇక ప్రహ్లాద్‌ బీజేపీ తరఫున బరిలో దిగితే బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకుకు గండిపడే ప్రమాదముంది. 2014లో తెలంగాణ తొలి మంత్రివర్గంలో పనిచేసిన అజ్మీరా చందూలాల్‌.. 2021లో కరోనా బారిన పడి మరణించిన సంగతి తెలిసిందే.




Updated : 7 Sep 2023 8:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top