అనుకూలంగా ఉన్న అంశాలపైనే రేవంత్ మాట్లాడుతున్నరు - హరీశ్ రావు
X
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్ ప్లన్ దినాలు పూర్తిగా తగ్గాయన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పందించారు. రేవంత్ కామెంట్లను తీవ్రంగా ఖండించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. సీఎం, మంత్రులు వారికి అనుకూలంగా ఉన్న అంశాలను తీసుకొని మాట్లాడుతున్నారని పాజిటివ్ గా ఉన్న అంశాలను విస్మరిస్తున్నారని చెప్పారు. 2014-15లో 303 రోజులు సర్ ప్లస్ ఉంటే 2015-16లో 364 రోజులు ఉన్నామన్న విషయం ఎందుకు చెప్పరని ప్రశ్నించారు.
2016-17లో 304 రోజులు, 2017-18లో 245 రోజులు, 2018-19లో 250 రోజులు రాష్ట్రం సర్‌ప్లస్‌లో ఉన్న విషయాన్ని హరీశ్ గుర్తు చేశారు. ఆ తర్వాత కరోనా, పెద్ద నోట్ల రద్దు కారణంగా ఆర్థిక మాంద్యం ఏర్పడి సర్ ప్లస్ తగ్గిందని చెప్పారు. ఈ పరిస్థితి ఒక్క తెలంగాణలోనే కాదని ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిందని హరీశ్ రావు స్పష్టం చేశారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రతిపైసా తీసుకొచ్చేందుకు సహకరిస్తామని హరీశ్ రావు హామీ ఇ్చచారు. అందుకోసం అవసరమైతే అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్తే వచ్చేందుకు తాము సిద్ధమని చెప్పారు. నిధుల విషయంలో ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి చర్చించే విషయంలో బీఆర్ఎస్ ఎంపీలతో పాటు తాము సహకారం అందిస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు.