Home > తెలంగాణ > Harish Rao: కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు..హరీష్ రావు

Harish Rao: కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు..హరీష్ రావు

Harish Rao: కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు..హరీష్ రావు
X

కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు. తమ హయాంలో ఏర్పాటు చేసిన కొత్త మండలాలను, జిల్లాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు తెలిసిందని మండిపడ్డారు. కొత్త విద్యుత్ పాలసీ తెస్తామని కాంగ్రెస్ అంటోందని, కొత్త పాలసీ అంటే పాత కాంగ్రెస్ కరెంటు తెస్తారా? అని హరీష్ రావు ప్రశ్నించారు. శుక్రవారం మెదక్ జిల్లా, మనోహరాబాద్ మండలం, జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ మొక్కవోని పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, చావు నోట్లో తల పెట్టి కేసీఆర్ తెలంగాణను సాధించారని గుర్తు చేశారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదని.. కేసీఆర్ను తెలంగాణను ఎవరూ వేరు చేయలేరని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే మన నీళ్లు మనకు వచ్చాయని, మన గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. ప్రజాతీర్పును అంగీకరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి వేసిన ప్రతి ఓటు కోసం కృతజ్ఞతతో పనిచేస్తామని స్పష్టం చేశారు.

కేసీఆర్ రైతులకు ఇచ్చిన 24 గంటల కరెంట్పై అబద్ధాలు చెబుతున్నారని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీని రద్దు చేశారని విమర్శించారు. మనం చేసిన అభివృద్ధిని కక్షతో అడ్డుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నామని, నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకుంటరా? అని అన్నారు. కాంగ్రెస్కు ప్రజలంటే రాజకీయం, బీఆర్ఎస్కు ప్రజలంటే బాధ్యత అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, ఓడినంత మాత్రాన ప్రజలను వదిలేయమని.. వారి పక్షాన పోరాడతామని, బీఆర్ఎస్కు ప్రజలే దేవుళ్లని అన్నారు. ఎన్నికల హామీల అమలు కోసం ప్రజల పక్షాన అసెంబ్లీలో గట్టిగా పోరాడతామని హరీష్ రావు స్పష్టం చేశారు.




Updated : 12 Jan 2024 2:04 PM IST
Tags:    
Next Story
Share it
Top