Home > తెలంగాణ > కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కుట్రలు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కుట్రలు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ ఆన‌వాళ్లు ఉండొద్ద‌నేది రేవంత్ ఉద్దేశం

కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కుట్రలు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
X



మెగా ప్రాజెక్టులు క‌ట్టిన‌ప్పుడు అక్క‌డ‌క్క‌డ సాంకేతిక ఇబ్బందులు త‌లెత్తుతాయని.. . మేడిగ‌డ్డ‌లో 3 పిల్ల‌ర్లు కుంగితే మొత్తం కాళేశ్వ‌రం వేస్ట్ అన్న‌ట్టు ప్రభుత్వం మాట్లాడుతుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మేడిగడ్డ పర్యటనలో భాగంగా అన్నారం బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన స‌మావేశంలో హ‌రీశ్‌రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతుల ప‌క్షాన‌, ప్ర‌జ‌ల ప‌క్షాన ప‌ని చేయ‌కుండా.. ప్ర‌తిప‌క్షం మీద బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నదని విమర్శించారు. గ‌త ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయాలి.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో నాలుగు సీట్లు ఎక్కువ‌గా పొందాల‌ని దుగ్ద‌తో కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హ‌రిస్తోందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్‌ను పడగొట్టాలంటే కాళేశ్వరం ప్రాజెక్టును పడగొడితే సరిపోతుందని ఆలోచిస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గతంలో ప్రగతి భవన్‌ను బాంబులతో పేలుస్తామని అన్నారని గుర్తు చేశారు. "కేసీఆర్ ఆన‌వాళ్లు లేకుండా చేస్తాన‌ని అసెంబ్లీలో మాట్లాడారు. కేసీఆర్ క‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టును కూడా ధ్వంసం చేసేందుకు కూడా రేవంత్ వెనుకాడ‌రు. ఎందుకంటే రాష్ట్రంలో కేసీఆర్ ఆన‌వాళ్లు ఉండొద్ద‌నేది రేవంత్ ఉద్దేశం. బీఆర్ఎస్‌పై అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోంది. కాబ‌ట్టి ప్ర‌తి ఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండి కాంగ్రెస్ ప్ర‌భుత్వ విధానాల‌ను ఎండ‌గట్టాల‌ని" పిలుపునిచ్చారు.

మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించవచ్చని ఇంజనీర్లు చెప్పారని.. వర్షం కాలం వచ్చే లోపు కుంగిపోయిన పిల్లర్లకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని హరీష్ రావు సీరియస్ అయ్యారు. తాము ఏదైనా కార్యక్రమం పెట్టిన రోజే.. ప్రభుత్వం మరో ప్రోగాం నిర్వహిస్తుందన్నారు. "ప్ర‌తిప‌క్షానికి స్పేస్ లేకుండా తామే మొత్తం ఆక్ర‌మించుకోవాల‌ని చూస్తోంది. ఇది కాంగ్రెస్ ప్ర‌భుత్వం పైశాచిక ఆనందం. ఇది ప్ర‌భుత్వం అవ‌లంభించే ప‌ద్ధ‌తి కాదు. ఇది ప్ర‌భుత్వ విధానం కానేకాదు" అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారం చూస్తుంటే రైతు ప్ర‌యోజ‌నాల కంటే రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.


Updated : 1 March 2024 3:28 PM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top