Home > తెలంగాణ > పార్లమెంట్పై దాడి దురదృష్టకరం.. మాజీ మంత్రి హరీశ్ రావు

పార్లమెంట్పై దాడి దురదృష్టకరం.. మాజీ మంత్రి హరీశ్ రావు

పార్లమెంట్పై దాడి దురదృష్టకరం.. మాజీ మంత్రి హరీశ్ రావు
X

పార్లమెంట్ పై దుండగుల దాడి దురదృష్టకరమని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఓ వైపు సమావేశాలు జరుగుతుండగా పార్లమెంట్ లోకి దుండగులు ప్రవేశించి భీభత్సం సృష్టించడం భద్రతా వైఫల్యానికి నిదర్శనమి అన్నారు. ఈ దాడిలో ఎంపీలకు ఎలాంటి హాని జరగకపోవడం సంతోషమన్నారు. ఘటనకు బాధ్యులు ఎవరో తెలుసుకోవడానికి వెంటనే సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు. పార్లమెంట్ పై దాడికి పాల్పడిన ఆగంతకులను కఠినంగా శిక్షించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇక ఈ దాడికి సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశారు.

కాగా మధ్యాహ్నం లోక్ సభలో జీరో అవర్ జరుగుతుండగా విజిటర్స్ గ్యాలరీలో నుంచి ఇద్దరు ఆగంతకులు లోపలికి దూసుకొచ్చారు. ఎంపీల సీట్ల నుంచి జంప్ చేస్తూ పొగ గ్యాస్ లను వదిలారు. దీంతో ఎంపీలంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక బయటకు పరుగులు తీశారు. ఇక కొంతమంది ఎంపీలు దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. చివరికి ఆగంతకులను సెక్యూరిటీ సిబ్బంది అరెస్ట్ చేశారు. దాడి నేపథ్యంలో సమావేశాలను కొంత సమయం పాటు వాయిదా వేశారు. అనంతరం సమావేశాలు తిరిగి ప్రారంభం కాగా.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని, దానికి పూర్తి బాధ్యత తనదేనని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పార్లమెంట్ దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. పార్లమెంట్ కే రక్షణ లేకుంటే సామాన్య జనాల పరిస్థితి ఏంటనీ విపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు.


Updated : 13 Dec 2023 11:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top