Home > తెలంగాణ > బీసీల వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్.. అందుకే రాజీనామా చేస్తున్నా: మాజీ మంత్రి

బీసీల వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్.. అందుకే రాజీనామా చేస్తున్నా: మాజీ మంత్రి

బీసీల వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్.. అందుకే రాజీనామా చేస్తున్నా: మాజీ మంత్రి
X

అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే 115 మంది అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, సీనియర్ లీడర్లను పార్టీ అధిష్టానం పక్కనబెట్టింది. దీంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న పలువురు నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. పతువురు రాజీనామా కూడా చేశారు. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కృష్ణయాదవ్ పార్టీకి రాజీనామా చేశారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా తనకు తీవ్ర నిరాశ కలిగించిందని తెలిపారు. ఆత్మగౌరవం లేని పార్టీలో కొనసాగడం ఇష్టం లేకనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 2018 నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా.. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ వ్యతిరేక పార్టీ, భూస్వాములను, పెత్తం దారులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని తీవ్ర వి మర్శలు చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు సీట్లు కేటాయించలేదని బీఆర్ఎస్ ను విమర్శించారు. ప్రస్తుతం ఏ పార్టీలో చేరే ఆలోచన లేదని, మూడు నాలుగు రోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.



Updated : 26 Aug 2023 6:25 PM IST
Tags:    
Next Story
Share it
Top