Home > తెలంగాణ > KTR : ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది..

KTR : ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది..

KTR : ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది..
X

ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ కాలరాసే ప్రయత్నం చేస్తోందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ నీచ సంసృతిని ఎండగట్టేందుకే మేడిగడ్డ సందర్శన అన్నారు. బాధ్యతను మరిచిన ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం తన బాధ్యతను మరిచిపోయిందన్నారు. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసేందుకే మేడిగడ్డ సందర్శన అని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రిజార్వాయర్లను బీఆర్ఎస్ నేతలతో కలిసి సందర్శిస్తామని చెప్పుకొచ్చారు.

కుంగిపోయిన పిల్లర్లను బాగుచేయాల్సింది పోయి..బీఆర్ఎస్ పై దుమ్మేత్తి పోసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. నీళ్లు వదలకుండా తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నిజనిజాలను ప్రజల దృష్టికి తీసుకొస్తామని అన్నారు. ప్రాజెక్ట్ లో తప్పులు ఉంటే బాధ్యుల మీద చర్యలు తీసుకొండని చెప్పారు. బీఆర్ఎస్ పై కోపాన్ని రైతుల మీద తీర్చకోకండని కోరారు. ఇది మొదటిది మాత్రమే..అన్ని రిజర్వాయర్లను తర్వలోనే సందర్శిస్తామని కేటీఆర్ అన్నారు.

Updated : 1 March 2024 9:59 AM IST
Tags:    
Next Story
Share it
Top