Home > తెలంగాణ > కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి నా జీవితాన్ని ముగిస్తా.. మోత్కుపల్లి

కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి నా జీవితాన్ని ముగిస్తా.. మోత్కుపల్లి

కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి నా జీవితాన్ని ముగిస్తా.. మోత్కుపల్లి
X

పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పుట్టిన రోజు సందర్భంగా లక్ష్మి నరసింహ స్వామీ వారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. 30 సంవత్సరాల కాలంలో 6సార్లు ఎమ్మెల్యేగా ప్రతీ ఇంటిలో తానే ఉన్నానని తెలిపారు. నరసింహులు మాట ఇస్తే నూటికి నూరుశాతం పని పూర్తవుతుందనే నమ్మకం ప్రజలలో ఉందన్నారు. ప్రజలలో నాయకుడికి ఎప్పుడు ఓటమి ఉండదని వెల్లడించారు.





కేసీఆర్ అవకాశం ఇస్తే..ఎక్కడైనా గెలిచే సత్తా నాకు ఉందన్నారు. అయితే సీఎం తనకు ఏ బాధ్యత ఇచ్చినా.. ఇష్ట పూర్వకంగా స్వీకరిస్తానని, తనకు మాత్రం ప్రజా క్షేత్రంలో.. ప్రజల మనిషిగా పనిచేస్తూ.. అందరికీ సేవ చేయాలని ఉందని తన మనసులోని మాటను చెప్పారు. నల్గొండలోని మొత్తం12 నియోజకవర్గాల్లోనూ తనకు ఎక్కడైనా గెలిచే సత్తా ఉందన్నారు. NTR నా రాజకీయ భవిష్యత్ దేవుడని చెప్పారు.

తరతరాలుగా అనుభవిస్తున్న బానిస బతుకుల నుంచి విముక్తి కలగడానికి , దళితులంటే చిన్న చూపు విధానానికి స్వస్తి పలకాలని సీఎం కేసీఆర్ దళిత బంధు అనే వరం ప్రకటించారన్నారు మోత్కుపల్లి. ఆ వరాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. బర్రె, గొర్రె ఇచ్చే దానికంటే రూ.10 లక్షలు ఇస్తేనే బెటర్ అని కేసీఆర్ దళితబంధు ఇస్తున్నారన్నారు. దళితుణ్ని అయిన తాను అన్ని వర్గాల వారినీ అక్కున చేర్చుకున్నానని.. పేదొడిని గెలిచిన వాడికి ఓటమి లేదన్నారు. యాదాద్రి గర్భగుడి లోకి ప్రవేశం దళితుడిని అయినా తనతోని జరిగిందన్నారు. 30 సంవత్సరాల రాజకీయాలలో ఏ కేసు లేకుండా ఉన్న ఏకైక వ్యక్తిని తానేనని తెలిపారు. బ్రతికినంత కాలం కేసిఆర్ సారథ్యంలోనే కొనసాగుతానని, కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి నా జీవితాన్ని ముగిస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికలలో బీఅర్ఎస్ దే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.






Updated : 11 July 2023 7:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top