Home > తెలంగాణ > Vikram Goud: బీజేపీకి బిగ్‌ షాక్.. మాజీ మంత్రి కుమారుడు రాజీనామా

Vikram Goud: బీజేపీకి బిగ్‌ షాక్.. మాజీ మంత్రి కుమారుడు రాజీనామా

Vikram Goud: బీజేపీకి బిగ్‌ షాక్.. మాజీ మంత్రి కుమారుడు రాజీనామా
X

పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. బీజేపీకి మాజీమంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు, యువనేత విక్రమ్ గౌడ్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను.. పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. పార్టీలో కొత్త వారిని అంటరాని వారుగా చూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. క్రమశిక్షణకు మారు పేరంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పని చేసినా గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. ఏదో ఒక గ్రూప్ రాజకీయాలలో ఉంటేనే పార్టీలో మనుగడ అని చెప్పుకొచ్చారు. ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెబుతున్నారన్నారు. ఎన్నికల్లో ఓటమికి ఎవరు బాధ్యత తీసుకోలేదని లేఖలో విక్రమ్‌గౌడ్ పేర్కొన్నారు.

గత ఏడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుండి బీజేపీ తరపున పోటీ చేయాలని విక్రమ్ గౌడ్ భావించారు. కానీ అధిష్టానం రాజాసింగ్‌కు టిక్కెట్టు కేటాయించింది. విక్రమ్ గౌడ్ తండ్రి ముఖేష్ గౌడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. అయితే రాజకీయా పరిణామాల క్రమంలో బీజేపీలో చేరిన విక్రమ్ గౌడ్ గత కొంతకాలంగా పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఉండడంతో గోషామహల్ టికెట్‌ను ఆశించారు విక్రమ్ గౌడ్. అయితే ఎన్నికల సమయంలో రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసిన అధిష్టానం.. ఆ తర్వాత కొన్ని గంటలకే.. తొలి జాబితాలోనే ఆయన పేరు ప్రకటించి గోషామహల్ టిక్కెట్టు కన్ఫామ్ చేసింది. దీంతో విక్రమ్ గౌడ్ కు మొండి చెయ్యే ఎదురైనట్లు అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుండి మెజారిటీ సీట్లను దక్కించుకోవాలనే వ్యూహంతో బీజేపీ నాయకత్వం వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్న క్రమంలో విక్రమ్ గౌడ్రాజీనామా చేయడం ఆ పార్టీపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి

Updated : 11 Jan 2024 5:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top