Home > తెలంగాణ > రేవంత్ రెడ్డి మాట తీరు మార్చుకోవాలి...నిరంజన్ రెడ్డి

రేవంత్ రెడ్డి మాట తీరు మార్చుకోవాలి...నిరంజన్ రెడ్డి

రేవంత్ రెడ్డి మాట తీరు మార్చుకోవాలి...నిరంజన్ రెడ్డి
X

సీఎం రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కొడంగల్ లో రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు బాగోలేదని...వెంటనే ఆయన తీరు మార్చుకోవాలనని సూచించారు. రేవంత్ రెడ్డి మాట తీరు మార్చుకోకుంటే తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్ ను రేవంత్ ఇష్టానుసారంగా తిడుతున్నారని మండిపడ్డారు. సీఎం అయ్యాక కూడా భూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. పాలమూరు జిల్లా లో సాగునీరు కేసిఆర్ ఇవ్వలేదు అంటూ రేవంత్ అన్ని అబద్ధాలు చెప్తున్నారన్నారు.

పాలమూరులో నీళ్ళు ఇచ్చింది ఎవరో అందరికీ తెలుసని చెప్పారు. కాంగ్రెస్ రాగానే బటన్ ఆఫ్ చేసినట్టే కరెంట్ బంద్ అవుతుందా? అని ప్రశ్నించారు. వలసల జిల్లాగా పాలమూరును మార్చింది కాంగ్రెస్ కాదా అని విమర్శించారు. అసలు తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర ఏంటి అని దుయ్యబట్టారు. పాలమూరులో మీరు చేసిన అభివృద్ది ఏంటని డిమాండ్ చేశారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డి చేసిన శంకుస్థాపనలన్ని గత ప్రభుత్వ హాయంలో కేసీఆర్ తీసుకొచ్చినవే అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాల వల్లనే పాలమూరు జిల్లా ఎడారిగా మారిందని ఎద్దేవా చేశారు. పాలమూరు జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.




Updated : 22 Feb 2024 3:57 PM IST
Tags:    
Next Story
Share it
Top