Home > తెలంగాణ > కాంగ్రెస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు

కాంగ్రెస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు

కాంగ్రెస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు
X

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 17మంది అనుచరులతో ఆయన హస్తం గూటికి చేరారు. కాగా ఇవాళ ఉదయమే తుమ్మల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పాలేరు టికెట్ ఆశించిన తుమ్మలకు బీఆర్ఎస్ బాస్ షాకిచ్చారు. ఆ టికెట్ను కందాల ఉపేందర్ రెడ్డికి ఇచ్చారు.





అప్పటినుంచి బీఆర్ఎస్ పార్టీకి తుమ్మల దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం కేసీఆర్‌కు లేఖ పంపించారు. ‘తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇన్నాళ్లూ నాకు సహకరించినందుకు ధన్య వాదాలు... పార్టీకి నా రాజీనామాను సమర్పిస్తున్నాను’ అంటూ రాజీనామా లేఖను తుమ్మల ముగించారు.


Updated : 16 Sept 2023 4:08 PM IST
Tags:    
Next Story
Share it
Top