మరో ట్విస్ట్ బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్!
X
బీఆర్‌ఎస్ అధిష్థానానికి వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ షాక్ ఇచ్చారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన బీజేపీలో చేరనున్నారు. రమేశ్‌కు వరంగల్ ఎంపీ సీటు కేటాయించే అవకాశం ఉంది. కాగా నిన్న బీజేపీలో చేరుతున్నట్లు మీడియా సమావేశం పెట్టగా బీఆర్‌ఎస్ నేతలు ఆయనను కారులో తీసుకెళ్లారు. నిన్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి ఆయన బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. తాజాగా మరొసారి ట్విస్ట్ ఇచ్చారు.
ఆయన బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరతారన్న ప్రచారం కొనసాగగా.మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయనను హైదరాబాద్ కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆరూరిని కిడ్నాప్ చేశారనే వార్తలు సైతం వచ్చాయి. కానీ తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తానే పార్టీ నేతలతో కలిసి గులాబీ బాస్ కేసీఆర్ ను కలవడానికి వచ్చానని చెప్పారు. కానీ ఇవాళ అనూహ్యంగా ఆయన బీఆర్ఎస్ కు షాక్ ఇస్తూ కాషాయకండువా కప్పుకోనేందుకు హస్తినకు వెళ్లారు. అయితే వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను ఖరారు చేయడంపై ఆరూరి రమేశ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.