Malipedhi Sudheer Reddy: బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్లో చేరిన మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే
X
బీఆర్ఎస్కు మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం కండువా కప్పుకున్నారు. ఇవాళ మేడ్చల్లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉంది. ఈ క్రమంలో సుధీర్ రెడ్డి పార్టీ మారడం చర్చనీయాంశంగా మారింది.
మలిపెద్ది సుధీర్ రెడ్డి 2014లో బీఆర్‌ఎస్ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018లో మేడ్చల్ టికెట్ను గులాబీ బాస్ మల్లారెడ్డికి ఇచ్చారు. మల్లారెడ్డి గెలిచిన తర్వాత ఆయన్ను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. అప్పటినుంచి పార్టీ తీరుపై సుధీర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. అప్పట్లోనే పార్టీ మారుతారనే ప్రచారం జరగినా పార్టీ పెద్దలు నచ్చజెప్పి..ఆయన కొడుక్కి జడ్పీ చైర్మన్ పదవి దక్కేలా చూశారు. ఈ సారి కూడా మేడ్చల్ ఎమ్మెల్యే టికెట్ను మల్లారెడ్డికే ఇచ్చారు కేసీఆర్. దీంతో ఆయన హస్తం గూటికి చేరారు. మేడ్చల్ టికెట్ను ఇప్పటికే వజ్రేశ్ యాదవ్కు కన్ఫార్మ్ చేసింది కాంగ్రెస్.
Former Medchal MLA Malipeddi Sudhir Reddy garu , Zilla Parishad Chairman Sarath Chandra Reddy garu, Corporator Niharika garu ,former sarpanches and other leaders joined @INCIndia today. #Congress6Guarantees#Congress6TelanganaVictoryFix#KCRNeverAgain #ByeByeKCR pic.twitter.com/hrIwXP2zJt
— Revanth Reddy (@revanth_anumula) October 18, 2023