Pilot Rohith Reddy: సొంత పార్టీ నేతలే మోసం చేశారు.. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి
X
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ద్రోహం చేసినవారు ఎంతటి హోదాలో ఉన్నా వదిలిపెట్టబోమని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి అన్నారు. ఈమేరకు ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లో రహస్యంగా ఎవరు కలిశారనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తానన్నారు. తాండూరు, వికారాబాద్, కొడంగల్ BRS అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారనే విషయం అందరికీ తెలుసని చెప్పారు. అలాగే తాండూరు, వికారాబాద్‌లలో BRS అభ్యర్థులను ఓడించి బహుమతిగా ఇస్తానని రేవంత్‌తో చెప్పింది ఎవరనే విషయం అధిష్ఠాన వర్గానికీ తెలుసన్నారు. సమయం వచ్చినపుడు పార్టీ పెద్దలు మాట్లాడతారని పేర్కొన్నారు.
అంతకుముందు యాలాల మండలం ముద్దాయిపేట్ లో జరగుతున్న రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు రోహిత్ రెడ్డి. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలో పాల్గొన్న పైలెట్ కు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అమ్మవారి చల్లని చూపు ప్రజలపై తప్పక ఉంటుందని పేర్కొన్నారు. గతంలో ఆలయాల అభివృద్ధికి బీఅర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్ రెడ్డి, సర్పంచులు మధుసుధన్ రెడ్డి, బసి రెడ్డి నాయకులు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.