Home > తెలంగాణ > ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం.. పరారీలో BRS మాజీ ఎమ్మెల్యే కొడుకు..

ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం.. పరారీలో BRS మాజీ ఎమ్మెల్యే కొడుకు..

ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం.. పరారీలో BRS మాజీ ఎమ్మెల్యే కొడుకు..
X

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుత్రరత్నం ఫుల్లుగా మందు కొట్టి ప్రజా భవన్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టినట్లు పక్కా సమాచారం. ఈ నెల 23న అర్ధరాత్రి దాటాక 2.45 గంటల సమయంలో అతివేగంతో దూసుకొచ్చిన BMW కారు( TS13 ET 0777) ప్రజా భవన్ ముందున్న బారికేడ్లను ఢీకొట్టింది. కారులో ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు వున్నట్లు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. అయితే కారు ప్రమాదం జరగ్గానే ఓ యువకుడు పరారవగా మరొకరిని పోలీసులు పట్టుకున్నారు. అతడికి డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం సేవించలేదని తేలింది.

బారికేడ్లను ఢీ కొట్టింది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు అని తెలిసి, అతన్ని ఈ కేసులో నుంచి తప్పించేందుకు దర్యాప్తు అధికారి.. అబ్దుల్ ఆసిఫ్ అనే వ్యక్తి పేరు మీద ఎంవీ యాక్ట్ సెక్షన్ 184, ఐపీసీ 279 ప్రకారం కేసులు నమోదు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం కాస్త వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ దృష్టికి వెళ్లడంతో.. స్వయంగా దర్యాప్తు చేపట్టగా అసలు నిజాలు వెలుగుచూశాయి. ప్రమాద సమయంలో కారు డ్రైవ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహెల్ గా గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం సాహెల్ పరారీ లో ఉన్నాడని, మిగతా వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

ప్రమాద సమయంలో సాహెల్ పరారవ్వగా... అతడి ఇంట్లో పనిచేసే డ్రైవర్ తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి చెప్పాడన్నారు. పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు.. ప్రాథమిక విచారణలో భాగంగా అతన్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఆ డ్రైవర్ ను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామన్నారు. కాగా, గతంలోనూ షకీల్ కుమారుడు కారుతో ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదానికి కారణమయ్యాడు.

Updated : 26 Dec 2023 11:22 AM IST
Tags:    
Next Story
Share it
Top