Home > తెలంగాణ > Narsa Reddy Passed : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు మృతి

Narsa Reddy Passed : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు మృతి

Narsa Reddy Passed : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు మృతి
X

కాంగ్రెస్ పార్టీ కురువృద్ధులు, మాజీ మంత్రి, మాజీ టీపీసీసీ అధ్యక్షులు పి.నర్సారెడ్డి (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. నర్సారెడ్డి మృతిపట్ల రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. ఆయన స్వస్థలం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మలక్ చించోలి గ్రామం. 1971-72లో ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. 1962, 1967, 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1989 ఆదిలాబాద్ లోక్ సభకు 9వ పార్లమెంట్ సభ్యునిగా విజయం సాధించారు. మాజీ సీఎం జలగం వెంగళరావు హయాంలో రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వివిధ హోదాల్లో సేవలందించారు. నర్సారెడ్డి మృతిపట్ల.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు రాజకీయ ప్రముఖులు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.




Updated : 29 Jan 2024 9:41 AM IST
Tags:    
Next Story
Share it
Top