సత్తా ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించగలం.. Revanth Reddy
X
సత్తా ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించగలమని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శనివారం రవీంద్రభారతిలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.. సమస్యల పరిష్కారంలో శ్రీపాదరావు కీలక పాత్ర పోషించారన్నారు. శ్రీపాదరావు వారసత్వాన్ని తీసుకుని శ్రీధర్‌బాబు స్వయంకృషితో ఎదిగారన్నారు. శ్రీధర్‌బాబును చూసి పైనున్న శ్రీపాదరావు ఆనందిస్తారన్నారు. శ్రీధర్‌బాబు సేవలు, అనుభవం పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటామన్నారు. తండ్రి నుంచి స్ఫూర్తి పొందే శ్రీధర్‌బాబు శాసనసభ వ్యవహారాలు నిర్వహిస్తున్నారని, శ్రీపాదరావు లాంటి నేత తెలంగాణలో ఉండటం మన అదృష్టమన్నారు. ట్యాంక్‌బండ్‌పై శ్రీపాదరావు విగ్రహం పెట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కొందరిపై మేనేజ్‌మెంట్ కోటా అని అంటుంటానని, మేనేజ్‌మెంట్ కోటా అనేది మెుదటిసారి గెలవడానికే ఉపయోగపడుతుందని అన్నారు. సత్తా ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించగలమన్నారు.