Home > తెలంగాణ > ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న కేసీఆర్.. ఎప్పుడంటే

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న కేసీఆర్.. ఎప్పుడంటే

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న కేసీఆర్.. ఎప్పుడంటే
X

హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్.. రేపు(శుక్రవారం) డిశ్చార్జ్ కానున్నారు. ఈ మేరకు వైద్యులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. మాజీ సీఎం కేసీఆర్ గత గురువారం రాత్రి ఎర్రవల్లి లోని తన ఫామ్ హౌస్ లో జారిపడి గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన ఎడమ తుంటికి తీవ్ర గాయమవడంతో సోమాజిగూడలోని యశోద లో చేరారు. ఆస్పత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ నిర్వహించి తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లను అమర్చారు. ప్రస్తుతం కెసిఆర్ ఆస్పత్రిలోనే ఉంటూ కోలుకుంటున్నారు.

ప్రస్తుతం ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఇంటికి వెళ్లేందుకు వైద్యులు అనుమతించారు. ఆసుపత్రి నుంచి ఆయన నేరుగా నందినగర్ లోని తన నివాసానికి వెళ్లనున్నారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని... ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. రేపు డిశ్చార్జ్ చేస్తున్నామని వెల్లడించారు. ఆసుపత్రిలో కేసీఆర్ ను రేవంత్ రెడ్డి, చంద్రబాబు, చిరంజీవి, చిన్న జీయర్ స్వామి, ప్రకాశ్ రాజ్ తదితర ప్రముఖులు పరామర్శించారు. ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గత 6 రోజులుగా కేసీఆర్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

Updated : 14 Dec 2023 1:29 PM IST
Tags:    
Next Story
Share it
Top