Formula E race: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ రద్దు
X
దేశంలోనే తొలిసారిగా.. హైదరాబాద్ వేదికగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరిగిన విషయం తెలిసిందే. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా.. హుస్సేన్ సాగర్ తీరంలో ఈ ఈవెంట్ ను నిర్వహించారు. దేశంలో తొలిసారి జరిగిన అంతర్జాతీయ ఫార్ములా ఈ రేసింగ్ ఛాంపియన్ షిప్ చూసేందుకు.. అంతా హైదరాబాద్ కు క్యూ కట్టారు. ఇటీవల నగరంలో మరోసారి రేసింగ్ జరగనుందనే వార్తలు వినిపించాయి. అయితే ఈసారి రేసింగ్ అభిమానులకు చేదువార్తే మిగిలింది.
2024 ఫిబ్రవరి 10న ప్రతిష్ఠాత్మకంగా జరగాల్సిన ఈ ఈవెంట్ ‘ఇ-ప్రిక్స్ ఫార్ములా- ఇ’ రేసింగ్ రద్దైంది. దీంతో అభిమానులు షాక్ కు గురయ్యారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి లీగ్ నిర్వాహణకు స్పందన రాకపోవడంతో రేస్ ను రద్దు చేస్తున్నట్లు ఎఫ్ఐఏ తెలిపింది. కాగా ఈవెంట్ నిర్వహణకోసం చాలా కంపెనీలు ఇప్పటికే ఇన్వెస్ట్ చేశాయి. గత ఈవెంట్ ద్వారా ప్రభుత్వానికి, నిర్వహణ సంస్థకు 84 మిలియన్ డాలర్ల మేర ఆర్ధిక లబ్ధి జరిగింది.