Home > తెలంగాణ > పాతబస్తీ మెట్రోకు లైన్ క్లియర్..శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

పాతబస్తీ మెట్రోకు లైన్ క్లియర్..శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

పాతబస్తీ మెట్రోకు లైన్ క్లియర్..శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
X

హైదరాబాద్ పాతబస్తీకి మెట్రో లైన్ క్లియర్ అయింది. ఎట్టకేలకు పాతబస్తీకి మెట్రో సౌకర్యం అందనుంది. ఈ నెల 8న మెట్రోలైను నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల మేర మెట్రో రానుంది. మెట్రోలైన్ నిర్మాణానికి రూ.2,000 కోట్ల రూపాయాలు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ లైన్ నిర్మాణం పూర్తయితే సికింద్రాబాద్‌ నుంచి జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ మీదుగా పాతబస్తీకి వెళ్లవచ్చు. అయితే మెట్రో పనులను వేగంగా పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

హైదరాబాద్ లోని మెట్రో లైన్ల తొలి దశ ప్రాజెక్టును ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైలు సంస్థ దాదాపు రూ.16 వేల కోట్లతో చేపట్టింది. అయితే గతంలో పాతబస్తీకి మెట్రో వేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ సర్వేలో ఈ లైను నిర్మాణంతో వేలాది ప్రైవేటు ఆస్తులను సేకరించడంతో పాటు కొన్ని చారిత్రక కట్టడాలను తీసేయాల్సి వస్తుందని అంచనా వేశారు. దీంతో పాతబస్తీలో కొన్ని పార్టీలతో పాటు స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో మెట్రో లైను ప్రాజెక్ట్ ను చేపట్టకుండా ఆపేశారు. అయితే కాంగ్రెస సర్కార్ ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పాతబస్తీకి మెట్రోరైలు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేగాక హైదరాబాద్‌ మెట్రోరైలు అధికారులు రూపొందించిన ప్రణాళికను రేవంత్ రెడ్డి ఆమోదించారు.

అయితే కొత్త లైను ఎంజీబీఎస్‌ నుంచి దారుషిఫా, పురానీ హవేలీ, ఏత్‌బార్‌ చౌక్‌, అలిజాకోట్ల, మీర్‌మొమిన్‌ దాయరా, హరిబౌలి, శాలిబండ, షంషీర్‌గంజ్‌, అలియాబాద్‌ మీదుగా ఫలక్‌నుమా వరకు ఏర్పాటు కానుంది. 5.5 కి.మీ. మేర మార్గంలో 4 స్టేషన్లను సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, శాలిబండ, ఫలక్‌నుమా ఏర్పాటు చేయనున్నారు. ఇవి చారిత్రక కట్టడాలకు 500 మీటర్ల దూరంలో ఉంటాయి. మెట్రో నిర్మాణంలో టెంపుల్స్, ఇతర ఆలయాలు, చారిత్రక కట్టడాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకొవాలని సీఎం ఆదేశించారు.

Updated : 5 March 2024 2:59 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top