Home > తెలంగాణ > నలుగురు తెలంగాణ, ఇద్దరు ఏపీ హైకోర్టు జడ్జిల ట్రాన్స్ఫర్

నలుగురు తెలంగాణ, ఇద్దరు ఏపీ హైకోర్టు జడ్జిల ట్రాన్స్ఫర్

నలుగురు తెలంగాణ, ఇద్దరు ఏపీ హైకోర్టు జడ్జిల ట్రాన్స్ఫర్
X

తెలంగాణ హైకోర్టుకు చెందిన నలుగురు జడ్జిలను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ ఎం.సుధీర్‌ కుమార్‌ను మద్రాస్‌, జస్టిస్‌ మున్నూరి లక్ష్మణ్‌ను రాజస్థాన్‌, జస్టిస్‌ సి.సుమలతను కర్నాటక, జస్టిస్‌ అనుపమా చక్రవర్తిని పట్నా హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పింది. అయితే జస్టిస్‌ సుధీర్‌ కుమార్‌ను కోల్‌కతా హైకోర్టుకు పంపాలని భావించినా.. ఆయన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక లేదా మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పింది. ఆయన అభ్యర్థన మేరకు మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది.





జస్టిస్‌ అనుపమా చక్రవర్తి తెలంగాణ హైకోర్టుకు దగ్గరలో ఉన్న హైకోర్టుకు బదిలీ చేయాలని కోరారని.. ఆమె అభ్యర్థనలో మెరిట్‌ లేనందున పట్నా హైకోర్టుకే పంపుతున్నట్లు చెప్పింది. బదిలీని వాయిదా వేయాలని లేదా విరమించుకోవాలని లేదా కర్ణాటక హైకోర్టుకు పంపాలని జస్టిస్‌ మున్నూరి లక్షణ్‌ కోరారని, కానీ రాజస్థాన్‌ హైకోర్టుకే బదిలీ చేయాలని మరోసారి స్పష్టం చేసినట్లు కొలీజియం ప్రకటించింది. జస్టిస్‌ సుమలత ఆంధ్రప్రదేశ్ గానీ కర్ణాటక హైకోర్టుకుగానీ బదిలీ చేయాలని కోరారని ఆమె విజ్ఞప్తిని పరిశీలించి గుజరాత్‌ హైకోర్టు బదులు కర్నాటకకు ట్రాన్స్ ఫర్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పింది.

ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన ఇద్దరు జడ్జిలను ట్రాన్స్ ఫర్ చేయాలని కొలీజియం నిర్ణయించింది. జస్టిస్ సి. మానవేంద్ర రాయ్‌ను గుజరాత్‌కు, జస్టిస్‌ దుప్పల వెంకటరమణను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేసింది. జస్టిస్‌ మానవేంద్రరాయ్‌ తెలంగాణ హైకోర్టుకు బదిలీ కోరినా.. అందులో మెరిట్‌ లేదన్న కారణంతో నిరాకరించింది. జస్టిస్‌ దుప్పల వెంకట రమణ కర్నాటక హైకోర్టుకు బదిలీ చేయాలని కోరగా దాన్ని తిరస్కరించింది. మధ్యప్రదేశ్‌కు కేటాయిస్తున్నట్లు చెప్పింది.




Updated : 11 Aug 2023 6:57 AM GMT
Tags:    
Next Story
Share it
Top