Home > తెలంగాణ > PVNR ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం.. పల్టీలు కొట్టిన కార్లు

PVNR ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం.. పల్టీలు కొట్టిన కార్లు

PVNR ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం.. పల్టీలు కొట్టిన కార్లు
X

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పై వరుసగా నాలుగు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మూడు కార్లు, ఒక వ్యాన్ ధ్వంసం కాగా.. ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున పిల్లర్ నెంబర్ 139 వద్ద చోటు చేసుకుంది.

వివరాలు.. ఈరోజు తెల్లవారుజామున శంషాబాద్ నుంచి మెహిదీపట్నం వైపు వస్తుండగా ఓ వ్యాన్ పీవిఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై పిల్లర్ నంబర్ 139 వద్ద అకస్మాత్తుగా ఆగింది. వెనకాల వస్తున్న కారు దానిని తప్పించే క్రమంలో డివైడర్‌ను ఢీకొంది. దాని వెనకాల వచ్చిన మరో మూడు కార్లు, వ్యాన్ వరుసగా ఒక దానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాలు ధ్వంసం కాగా.. ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. వాహనాలు ఒకదానికొకటి వరుసగా ఢీకొనడంతో సుమారు కిలోమీటర్ మేర వాహనాలు స్తంభించాయి. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వాహనాలను నియంత్రించారు. ధ్వంసమైన కారులను అక్కడి నుంచి తరలించారు.




Updated : 16 Sept 2023 1:02 PM IST
Tags:    
Next Story
Share it
Top