Home > తెలంగాణ > తెలంగాణలో ఫాక్స్కాన్ మరో భారీ పెట్టుబడి.. ఏకంగా..

తెలంగాణలో ఫాక్స్కాన్ మరో భారీ పెట్టుబడి.. ఏకంగా..

తెలంగాణలో ఫాక్స్కాన్ మరో భారీ పెట్టుబడి.. ఏకంగా..
X

తెలంగాణలో మరో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఫాక్స్కాన్ సిద్ధమైంది. రాష్ట్రంలో ఇప్పటికే పెట్టబుడులు పెట్టిన ఫాక్స్కాన్ మరో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మరో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘మొత్తం 550 మిలియన్ డాలర్ల పెట్టబడులతో తెలంగాణకు ఇచ్చిన మాటను మాటను నెరవేర్చేందుకు ఫాక్స్కాన్ సిద్ధమైంది. ఆ సంస్థతో తమ స్నేహం స్థిరంగా ఉంది. ఇది తెలంగాణ పురోగతిని మరోసారి రుజవు చేసింది’’ అని ట్వీట్ చేశారు.





కాగా కొంగరకలాన్లో ఫాక్స్కాన్ ప్లాంట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మే 15న ఈ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. ఈ యూనిట్ లో సుమారు 1656 కోట్ల పెట్టుబడులు పెడుతుంది. ఇక మార్చి 2న రాష్ట్రానికి వచ్చిన ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్‌కు.. రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ఎంవోయూ కుదిరింది.

ఈ ఒప్పందం ద్వారా ఫాక్స్కాన్ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనది. ఇప్పుడు ఆ కంపెనీ మరో భారీ పెట్టుబడిని ప్రకటించడం హర్షించదగ్గ విషయం.






Updated : 12 Aug 2023 6:30 PM IST
Tags:    
Next Story
Share it
Top