Home > తెలంగాణ > Free Bus Effect : ఫ్రీ జర్నీ ఎఫెక్ట్ .. కండక్టర్‌ని పక్కకు నెట్టి, జుట్లు పట్టుకుని వాగ్వాదం

Free Bus Effect : ఫ్రీ జర్నీ ఎఫెక్ట్ .. కండక్టర్‌ని పక్కకు నెట్టి, జుట్లు పట్టుకుని వాగ్వాదం

Free Bus Effect : ఫ్రీ జర్నీ ఎఫెక్ట్ .. కండక్టర్‌ని పక్కకు నెట్టి, జుట్లు పట్టుకుని వాగ్వాదం
X

అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఎన్నికల సమయంలో హమీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మీ స్కీం తీసుకొచ్చి.. ఆర్డినరి, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. ఇందుకు సరైన గుర్తింపు కార్డు ఉంటే చాలు మహిళలు ఈ రెండు బస్సు సర్వీసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంచక్కా తిరగొచ్చు. అయితే, ఫ్రీ బస్సు పలు చోట్ల మహిళలు గొడవకు దిగడంతో పాటు కొట్టుకోవడం ఇటీవల చూస్తున్నాం.

తాజాగా నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండల కేంద్రంలో సీటు కోసం మహిళలు కొట్లాడుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిజామాబాద్‌ నుంచి భైంసా వస్తున్న ఆర్టీసీ బస్సు గురువారం మధ్యాహ్నం ముథోల్‌ ప్రయాణ ప్రాంగణానికి చేరుకుంది. కొన్ని సీట్లు ఖాళీకాగా అప్పటికే రెండు బస్సులు చెడిపోవడంతో అందులోని ప్రయాణికులు ఈ బస్సులో ఎక్కారు. ముథోల్‌లో ఎక్కిన కొందరు మహిళలు సీటు ఆపగా.. అప్పటికే బస్సులోని మహిళలకు వీరికి ఆ సీటు కోసం వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాట పెరిగి రెండు వర్గాలు పోట్లాడుకున్నాయి. కండక్టర్‌ ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి నిజామాబాద్‌ నుంచి వస్తున్న మహిళ బస్సు దిగిపోగా గొడవ సద్దుమణిగింది.



Updated : 12 Jan 2024 8:55 AM IST
Tags:    
Next Story
Share it
Top