Home > తెలంగాణ > ఫిబ్రవరి 2 నుంచి ప్రజల్లోకి : సీఎం రేవంత్

ఫిబ్రవరి 2 నుంచి ప్రజల్లోకి : సీఎం రేవంత్

ఫిబ్రవరి 2 నుంచి ప్రజల్లోకి : సీఎం రేవంత్
X

60 రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అంచన వేశారు.హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, పీఈసీ సభ్యులు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, కార్యచరణపై సుధీర్ఘంగా చర్చించారు. అంతేకాదు.. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.మంచి ఫలితాలు రాబట్టేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని.. మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని సూచించారు.

అసెంబ్లీ ఎన్నికల్లోనే బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు బొందపెట్టారని సీఎం అన్నారు. ఉనికి కాపాడుకోవడానికి కేటీఆర్, హారీశ్‌రావు విమర్శలు చేస్తున్నారని ఆయన తెలిపారు. బీజేపీని ఎదర్కొనే సత్తా ఒక్క కాంగ్రస్‌కు మాత్రమే ఉందని తెలిపారు.ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం కార్యచరణ రూపొందించిందని తెలిపారు. ఎన్నికల వేళ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నామని అన్నారు. మొదటగా ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎంపీ అభ్యర్థుల ఎంపికకు పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే అధిష్టానం తెలంగాణకు ఎన్నికల పరిశీలకులను నియమించిందని అన్నారు.

Updated : 30 Jan 2024 7:57 PM IST
Tags:    
Next Story
Share it
Top