Home > తెలంగాణ > TS RTC : ఏపీ ప్రజలకు తిప్పలు తెచ్చిన మహాలక్ష్మి పథకం

TS RTC : ఏపీ ప్రజలకు తిప్పలు తెచ్చిన మహాలక్ష్మి పథకం

TS RTC :  ఏపీ ప్రజలకు తిప్పలు తెచ్చిన మహాలక్ష్మి పథకం
X

సంక్రాంతి పండుగకు ఊరెళ్ళడం జనాలకు పెద్ద టాస్క్‌గా మారింది. హైదరాబాద్ నుండి వెళ్ళే రైళ్ల టికెట్స్ అన్ని ఇప్పటికే బుక్ కాగా.. రిజర్వ్‌డ్‌ బస్సుల పరిస్థితి కూడా అలానే కనిపిస్తుంది. పండుగ సందర్భంగా స్పెషల్ ట్రెన్స్ ప్రకటించిన వాటిలో కూడా టికెట్స్ దాదాపు అయిపోయాయి. వెయిటింగ్‌ లిస్టే 150 నుంచి 250 మించి కనిపిస్తోంది. జనాలకు ఏమైనా ఆశ ఉందంటే అది నగరం నుండి జిల్లాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్, ఆర్డీనరి బస్సుల పైనే.. అయితే మహాలక్ష్మి పథకం కారణంగా అదనపు బస్సులను

నగరానికి నడపడంలో టీఎస్ ఆర్టీసీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత పల్లెవెలుగు బస్సులతో పాటు ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రద్దీ పెరిగింది. ఈ బస్సులు 80 నుండి 100 ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇప్పుడు ఉన్న పళంగా వివిధ రూట్లకు వెళ్ళే బస్సులను రద్దు చేసి నగరానికి నడపడమంటే సవాలుతో కూడుకున్న పనే.

జనవరి రెండో వారం నుండే ఊళ్లకు ప్రమాణాలు మొదలవుతాయి ఏటా 25 లక్షలకు పైగా జనాలు సొంతూళ్ళకు వెళ్తుంటారు. అయితే టీఎస్ ఆర్టీసీ ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని 4,500 వరకు అదనపు బస్సులను నడిపేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే ఏపీఎస్‌ఆర్టీసీ కూడా అదనపు బస్సులను అందుబాటులోకి తెస్తుంది. దీని కోసం వివిధ డిపోల్లోని బస్సులను హైదరాబాద్‌కు నడిపేందుకు సిద్దమవుతుంది. అయితే సంకాత్రి సమయంలో తెలంగాణ కంటే ఏపీకి చెందిన ప్రజలే ఎక్కువగా సొంతూళ్ళకు వెళుతుంటారు. దీంతో టీఎస్ఆర్టీసీ కూడా ఆదాయం కోసం విజయవాడ, విశాఖ, ఏలూరు, చిత్తూరు, తిరుపతి వంటి తదితర ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది. అయితే ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని బస్సులను ఏపీకి నడిపిన తెలంగాణలో బస్సుల కొరత ఏర్పడుతుంది. మహలక్ష్మి పథకం దృష్ట్యా చాలా మంది మహిళలు బస్సుల్లోనే ప్రయాణం చేస్తారు. దీంతో అదనపు బస్సులను కూడా తెలంగాణలోనే నడపాల్సి వస్తుంది. ఇలా చేస్తే టీఎస్ఆర్టీసీ పెద్ద ఎత్తున ఆదాయం కొల్పొతుంది. ఇటీవల తెలంగాణ ఆర్టీసీలో కొత్త బస్సులు వచ్చిన వాటిని కూడా నగరం నుండి తెలంగాణ జిల్లాలకే నడపాల్సి ఉంటుంది.

ఇదే అదునుగా ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఛార్జీలను ఇష్టారీతిన పెంచేస్తారు. హైదరాబాద్‌ నుంచి విశాఖకు రూ.910 వరకు చార్జీ ఉంటే సంక్రాంతి డిమాండ్‌‌ను దృష్టిలో ఉంచుకోని రూ.1600కు పైగా ఛార్జీలను వసూలు చేస్తారు. విశాఖకే కాకుండా విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, చిత్తూరు వంటి ప్రాంతాలకు కూడా చార్జీలను పెంచేస్తారు. దీంతో నగరం నుండి సొంతూళ్ళకు వెళ్ళే ప్రయాణికులకు ఇది పెద్ద సమస్యగా మారింది.

Updated : 3 Jan 2024 8:13 AM GMT
Tags:    
Next Story
Share it
Top