Home > తెలంగాణ > స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్

స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్

స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్
X

కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. స్పీకర్ పదవికి నామినేషన్ల గడువు నేటితో ముగియగా.. గడ్డం ప్రసాద్ కుమార్ కు సంబంధించి ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. దీంతో స్పీకర్ గా ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. రేపు అసెంబ్లీలో గడ్డం ప్రసాద్ ను స్పీకర్ గా ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రావాల్సిందిగా స్పీకర్ కార్యాలయం కోరింది. కాగా వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం ప్రసాద్ ను కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఎన్నికల బరిలోకి దింపింది. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని విపక్ష పార్టీల ఎల్పీ నేతలను అధికార పార్టీ కోరింది.

ఈ నేపథ్యంలో గడ్డం ప్రసాద్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ అంగీకారం తెలిపింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ నుంచి ఎవరిని కూడా స్పీకర్ ఎన్నిక బరిలోకి దింపలేదు. అలాగే బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ నామినేషన్ కు తుది గడువైన ఇవాళ ఒకే ఒక్క నామినేషన్ (గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్) వచ్చింది. ఇక నామినేషన్ కు గడువు ముగియడంతో గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.


Updated : 13 Dec 2023 12:33 PM GMT
Tags:    
Next Story
Share it
Top