Home > తెలంగాణ > అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు

అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు

అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు
X



ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. జీవితాంతం వారు చేసిన త్యాగాలు, ప్రజాసేవకు గౌరవ సూచకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి సంబంధించిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఇదిలా ఉంటే సోమవారం ఉదయం 11 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. కళాకారుల ప్రదర్శనల మధ్య భారీ ర్యాలీగా గద్దర్ పార్థీవ దేహాన్ని ఆయన నివాసానికి తరలించనున్నారు. పలువురు ఉద్యమకారులు, రాజకీయ పార్టీల నేతలు అంతిమయాత్రలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు ఎల్బీ స్టేడియం నుండి బషీర్ బాగ్ చౌరస్తా, జగ్జీవన్ రామ్ విగ్రహం మీదుగా గన్ పార్క్ వైపు యాత్ర సాగనుంది. అమరులస్థూపం నుంచి భూదేవి నగర్ లోని గద్దర్ నివాసానికి పార్థీవదేహం తీసుకెళ్లనున్నారు. అనంతరం భూదేవి నగర్ లోని భూదేవినగర్ లోని గద్దర్ నివాసానికి పార్థివదేహం తీసుకెళ్లనున్నారు. మహాబోధి విద్యాలయ ఆవరణలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.




Updated : 6 Aug 2023 5:13 PM GMT
Tags:    
Next Story
Share it
Top