Home > తెలంగాణ > తూటాల్లా ఉద్యామానికి ఆయుధమైన గద్దర్ పాటలు..

తూటాల్లా ఉద్యామానికి ఆయుధమైన గద్దర్ పాటలు..

తూటాల్లా ఉద్యామానికి ఆయుధమైన గద్దర్ పాటలు..
X

ఉద్యమానికి ఊపు తెచ్చిన గళం ఆయన సొంతం. డప్పు చప్పుడు లేకున్నా.. పాటతో గెంతులేయించగల గాత్రం ఆయనది. కింద ధోతి, భుజంపై గొంగళి వేసుకుని చేతిలో కర్ర పట్టుకుని స్టేజిపై పాడుతుంటే.. ఉద్యామానికి ప్రాణం వచ్చేది. సమాజంలో జరిగే అన్యాయాలను పాటల రూపంలో మలిచి.. ప్రజల కళ్లకు కట్టినట్లు వివరించడంలో ఆయనది అందెవేసిన చేయి. ఉద్యమ స్పూర్తితో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, ప్రజల్లో చైతన్యం నింపారు. దళితులు, పేదల కోసం మహారాష్ట్ర, బిహార్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోనూ గద్దర్ నాటకాలు వేసి ఉద్య జ్వాల రగిలించారు.

పాటతో ఉద్యమానికి ప్రాణం:

తెలంగాణ ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. జ‌నం కోసం జంగు చేసిన ఆ పాట‌.. తెలంగాణ కోసం ధూమ్ ధామ్ చేసిన ఆ గానం.. ఆయ‌న‌ను ప్ర‌జాయుద్ధ‌నౌక‌గా మార్చేశింది. తన పాటలతో ఉద్యమానికి ఊపు తెచ్చి, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థుల్లో చైతన్యం నింపారు. ఆయన పాట జనాన్ని ఉత్సాహ పరిచి ఉద్యమం వైపు నడిపించేలా చేసింది. ప్రజల్లో ఉద్యమ జ్వాల రగిలించింది. ఉద్యమంలో సకల జనులు పదం పాడుతూ కదం తొక్కుతూ ముందుకు సాగితే.. పాలకులు సైతం దిగిరాక తప్పలేదు.

తెలంగాణ సాయుధ పోరాటంలో ‘బండెనుక బండి కట్టీ.. పదహారు బండ్లు గట్టి’ అంటూ నిజాం సర్కారుకు వ్యతిరేకంగా కొట్లాడటంతో మొదలైన పాట.. ఎట్టొల్లా మ‌ట్టిబొమ్మ‌వూ గాయిదొల్లా గాండ్ర‌గొడ్డ‌లీ, పొడుస్తున్న పొద్దు మీద అంటూ స‌మైక్య స‌ర్కారుతోనూ కొట్లాడింది. ఆయన పోరాటంలో స్ఫూర్తిని రగిలించే పాటలు ఎన్నెన్నో. కేవలం వాడుక భాషలోని మాటలను.. పాటలుగా మార్చే కొద్ది మంది గాయకుల్లో గద్దర్ ఒకరు.


అమ్మా.. తెలంగాణమా:

ఉద్యమ సమయంలో ఆయన పాడిన పాటలు అనేకం. ఆయన పాటలు వినేవాళ్లకు.. రాష్ట్రంలో వెనకబడిన పరిస్థితులు, పేదోళ్ల ఆకలి కేకలు, సమస్యలన్నీ కళ్లకు కట్టేలా చేస్తాయి. అందులో ముఖ్యమైనది ‘అమ్మా తెలంగాణమా.. ఆకలి కేకల గానమా’.. అప్పటి రాష్ట్ర పరిస్థితులను ప్రతిభింబిస్తుంది.


నంది అవార్డు కాదని:

సినిమా రంగంలో కూడా గద్దర్ పాటలతో తనదైన ముద్ర వేశారు. 90వ దశకంలో ఓ ఊపు ఊపిన పాట.. అన్నాచెల్లెళ్ల బంధాన్ని ప్రతిబింబిస్తూ ఆయన రాసిన పాట ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా..’. ఆర్.నారాయణ మూర్తి హీరోగా, దాసరి నారాయణ రావు డైరెక్షన్ లో వచ్చిన ‘ఒరేర్ రిక్షా’ సినిమాలో ఈ పాట ఉంటుంది. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అయిన ఈ పాటకు.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు కూడా ప్రకటించింది. అయితే, దాన్ని గద్దర్ సున్నితంగా తిరస్కరించారు. ‘మా భూమి’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ‘రంగుల కల’ సినిమాలో ‘భద్రం కొడుకో’, ‘మదనా సుందరీ’, ‘జామ్ జమ్మలబరి’.. దండకారణ్యం సినిమాలో ‘భరత దేశం’, ‘పొద్దు తిరుగుడు పువ్వా’, ‘అడవి తల్లికి వందనం’ వంటి పాటలు పాడారు.

Updated : 6 Aug 2023 11:57 AM GMT
Tags:    
Next Story
Share it
Top