Home > తెలంగాణ > హాస్పిటల్ బెడ్ పైనా.. ఉద్యమ పాటలే

హాస్పిటల్ బెడ్ పైనా.. ఉద్యమ పాటలే

హాస్పిటల్ బెడ్ పైనా.. ఉద్యమ పాటలే
X

ప్రజా పోరాటాల మహాశిఖరం ఒరిగిపోయింది. పాటతో ప్రతి గుండెను తాకి, పోరాటాల బాట పట్టేలా చేసింది. తన స్వరం.. కోట్లాది మందిలో చైతన్యం రగిల్చింది. ఆయన ఒక్కో పాట.. ఒక్కో తూటాలా మారి నిరంకుశత్వంపై జంగ్ సైరన్ మోగించింది. తన పాట ఎన్నో ఉద్యమాలకు ఊపిరులూదింది. అలాంటి గొంతు.. చావుకు దగ్గర్లో ఉన్నప్పుడు కూడా పాటను వదల్లేదు. అమీర్పేట్లోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గద్దర్ మరణించారు. 12 రోజుల క్రితం గుండె ఆపరేషన్ చేసుకుని.. ఐసీయూ బెడ్ పైన ఉన్నప్పుడు కూడా ఆయన పాటను వదల్లేదు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా ఆయన పాటలు పాడారని ఆయన అల్లుడు శ్రీకాంత్ తెలిపారు. ఈ విషయాలు చెప్తూ కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.




Updated : 6 Aug 2023 6:59 PM IST
Tags:    
Next Story
Share it
Top