Home > తెలంగాణ > శరీరంతో తూటా ఉన్నా ఆగని పోరాటం..

శరీరంతో తూటా ఉన్నా ఆగని పోరాటం..

శరీరంతో తూటా ఉన్నా ఆగని పోరాటం..
X

ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రజా గాయకుడు గద్దర్ కష్టపడి చదివిన చదువుకు సార్థరక ఉండాలన్న ఉద్దేశంతో 1975లో బ్యాంక్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాశారు. కెనరా బ్యాంకులో క్లర్క్ గా జాయిన్ అయ్యారు. కొలువులో చేరాక పెళ్లి చేసుకున్నాడు. బ్యాంకు ఉద్యోగం చేస్తున్నా ఆయన ధ్యాసంతా సామాన్యుల సమస్యల మీదనే ఉండేది. అందుకే పదేళ్లు గడవక ముందే 1985లో ఉద్యోగానికి రాజీమానా చేసిన ఆయన ఉద్యమానికి పరిమితమయ్యాడు. 1985లో కారంచేడులో ద‌ళితుల మీద జ‌రిగిన దాడికి వ్య‌తిరేకంగా ఉద్య‌మాన్ని ముందుండి నడిపించాడు. ఒగ్గుక‌థ‌.. బుర్ర‌క‌థ‌.. ఎల్ల‌మ్మ క‌థ‌ల ద్వారా ఊరూరా చైతన్యం నింపే ప్రయత్నం చేశఆడు. మ‌హారాష్ట్ర‌, ఒడిశా, బీహార్‌ రాష్ట్రాల్లో ప్ర‌ద‌ర్శ‌నలిచ్చి ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకొచ్చారు గద్దర్.

శరీరంలో తూటాతో

1997 ఏప్రిల్ 6న పోలీసులు గ‌ద్ద‌ర్‌ మీద దాడి చేశారు. పాట‌ల తూటాల‌తో స‌మాజంలో ఎంతో చైత‌న్యం తీస్కొచ్చిన గ‌ద్ద‌ర్ శ‌రీరంలోకి బుల్లెట్లు దింపారు. డాక్టర్లు ఆపరేషన్ చేసి బుల్లెట్లను తీసినా వెన్నులో ఉన్న ఒక్క బుల్లెట్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఒకవేళ దాన్ని తీస్తే ప్రాణానికే ప్రమాదమని చెప్పడంతో 25 ఏండ్లకుపైగా శరీరంలోనే తూటాను పెట్టుకుని పోరాటాలు చేశారు.

ఆ తర్వాత నక్సలైట్ పార్టీలో ఉంటూ విప్లవ సాహిత్యంతో ప్రజల ముందుకొచ్చారు. విప్లవ రచయితల సంఘం ద్వార ప్రజలను చైతన్య పరిచారు. 2002లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్, వరవరరావులను తమ దూతలుగా పంపారు.

ప్రజల్లో చైతన్యం

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన తన పాటలతో ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చారు. వెనుకబడిన కులాలు, నిమ్న కులాల ఉద్ధరణ కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. బలమైన కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన గద్దర్ ప్రత్యేక తెలంగాణ విషయంలో మాత్రం పార్టీ భావాలతో ఏకీభవించలేదు. మావోయిస్ట్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నా ఆయన మాత్రం తెలంగాణకే మద్దతు ప్రకటించారు.

కానరాని లోకాలకు

జులై 20న అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన గద్దర్ ఇటీవలే ఓ ప్రకటన విడుదల చేశారు. సుదీర్ఘ బ‌తుకు పోరాటంలో అల‌స‌ట‌లేకుండా ప‌న్జేశిన తన గుండెకు కొంత స‌మ‌స్య‌ ఏర్పడిందని, సర్జరీ తర్వాత తొంద‌ర‌గా కోలుకొని ఆరోగ్యంగా బైటికొస్తానని చెప్పారు. రెండ్రోజుల క్రితమే ఆపరేషన్ జరిగింది. వారం పది రోజుల్లో గద్దర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయితారని అంతా భావిస్తున్న సమయంలో తెలంగాణ స‌మాజాన్ని, ఉద్య‌మ గీతాన్ని విడిచి.. పొడుస్తున్న పొద్దు మీద న‌డుస్తున్న విప్ల‌వ‌గీత‌మై ఇక సెల‌వంటూ కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.




Updated : 6 Aug 2023 5:10 PM IST
Tags:    
Next Story
Share it
Top