ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్ బహిష్కరణ
Mic Tv Desk | 21 Jun 2023 3:33 PM IST
X
X
తెలంగాణలో ప్రజా గాయకుడు గద్దర్ కొత్త పార్టీ ప్రకటించిన నేపథ్యంలో అతడిని ప్రజాశాంతి పార్టీ బహిష్కరించింది. గద్దర్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అధికార ప్రకటన చేసింది. మునుగోడు ఉపఎన్నికల సమయంలో గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు కేఏపాల్.. గద్దర్ మెడలో కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మునుగోడు ఉపఎన్నికల బరిలో ప్రజాశాంతి పార్టీ తరఫున గద్దర్ నామినేషన్ వేస్తారని కూడా ప్రకటించారు. కానీ అది జరగలేదు. తర్వాత కూడా ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో కనిపించలేదు. ఈ క్రమంలో తాజాగా కొత్త పార్టీని గద్దర్ ప్రకటించాడు. గద్దర్ ప్రజా పార్టీ’ పేరును గద్దర్ అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో అతడిని ప్రజాశాంతి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
Updated : 21 Jun 2023 3:33 PM IST
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire