Home > తెలంగాణ > సంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి అనుమానాస్పద మృతి

సంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి అనుమానాస్పద మృతి

సంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి అనుమానాస్పద మృతి
X

సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ మాధురి వద్ద సీసీగా పనిచేస్తున్న గడిల విష్ణువర్ధన్‌ (45) అనుమానాస్పదంగా మృతి చెందాడు. శనివారం రాత్రి మల్కాపూర్ చింతల్ రైస్ మిల్ వద్ద ఎవరో కాల్చి చంపినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే గత మూడు నెలలుగా అతనికి గుండెలో స్టంట్ వేయడంతో ఉద్యోగానికి సెలవు పెట్టి చికిత్స తీసుకుంటున్నాడు. తాజాగా అతను కొండాపూర్‌ మండలం తెలంగాణ టౌన్‌షిప్‌ వద్ద నిర్మానుష్య ప్రదేశంలో కాలిపోయి విగత జీవిగా పడడంతో హత్య చేసి ఉన్నట్లు స్థానికులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. చనిపోయిన కలెక్టరేట్ ఉద్యోగి విష్ణుకి భార్య శివ కృష్ణ కుమారి, కుమార్తె వైష్ణవి (18), కుమారుడు హర్షవర్ధన్‌ (16) ఉన్నారు. రాత్రి భార్య ఫోన్‌ చేస్తే విష్ణు మాట్లాడినట్లు సమాచారం.

సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఉద్యోగం చేస్తున్న విష్ణు మృతికి ఆత్మహత్య అని నిర్ధారణకు వచ్చాం. ఘటనా స్థలం వద్ద రెండు పెట్రోల్ నింపుకొచ్చిన కాలిబాటిలను గుర్తించాం. విష్ణుకి ఎవరితో ఎలాంటి గొడవలు లేవని కుటుంబంలో సభ్యుల ద్వారా తెలిసింది. మనస్థాపంతోనే తాను సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని సీఐ చంద్రయ్య తెలిపారు. . ఒక్కసారిగా ఇంటి పెద్ద దిక్కు ఇలా అనుమానస్పదంగా చనిపోవడంతో వారి ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.




Updated : 29 Oct 2023 12:10 PM IST
Tags:    
Next Story
Share it
Top