Home > తెలంగాణ > బీఆర్ఎస్కు భారీ షాక్.. కాంగ్రెస్లో చేరనున్న ఎమ్మెల్యే

బీఆర్ఎస్కు భారీ షాక్.. కాంగ్రెస్లో చేరనున్న ఎమ్మెల్యే

బీఆర్ఎస్కు భారీ షాక్.. కాంగ్రెస్లో చేరనున్న ఎమ్మెల్యే
X

పోలింగ్ తేదీ దగ్గర పడుతుంది. ప్రచార పర్వానికి ఇంకా నాలుగు రోజులే మిగిలుంది. దీంతో పార్టీ అభ్యర్థులు, నేతలు ప్రచారంలో వేగం పెంచారు. ఒక వైపు ఎన్నికల హీట్ ఉంటే.. మరోవైపు అసంతృప్తులు, ఆశావహులు పార్టీలు మారుతున్నారు. ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ జెండాలు మార్చేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలో జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ప్రస్తుత అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం మరికాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గద్వాల బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న అబ్రహం.. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాగా అలంపూర్ బీఆర్ఎస్ టికెట్ విజయుడికి దక్కింది.

బీఆర్ఎస్ మొదటి లిస్ట్ లో అబ్రహాంకు టికెట్ కేటాయించారు. అయితే బీఫామ్ ఇచ్చే టైంకు అబ్రహాంను తొలగిస్తూ విజయుడికి పార్టీ టికెట్ కట్టబెట్టింది. ఈ విషయంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వర్గం కూడా అభ్యంతరం వ్యక్తి చేసిది. అబ్రహాంను మార్చాలని కొందరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అబ్రహం స్థానంలో విజయుడికి టికెట్ ఇచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన అబ్రహం కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వాలు అందాయి. దీనికి తోడు పార్టీలో సముచిత హామీ వస్తుందని రేవంత్ రెడ్డి నుంచి హామీ వచ్చినట్లు సమాచారం.




Updated : 24 Nov 2023 11:56 AM IST
Tags:    
Next Story
Share it
Top