హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్తా.. అనర్హతపై గద్వాల్ ఎమ్మెల్యే
X
తన ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు అనర్హత వేటు వేయడంపై గద్వాల్ ఎమ్మెల్యే బండ కృష్ణ మెహన్ రెడ్డి స్పందించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ఫిడవిట్‌లో ఉద్దేశపూర్వకంగా ఎటువంటి సమాచారం దాచిపెట్టలేదన్నారు. డీకే అరుణ కోర్టును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. హైకోర్టు నుంచి తనకు నోటీసులు అందలేదని.. అందువల్ల తన వాదనలు లేకుండానే తీర్పు వచ్చినట్లు చెప్పారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తామని వివరించారు.
కాగా ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డిపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న కేసుపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ఈ క్రమంలో డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. గత ఎన్నికల్లో కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీచేయగా.. డీకే అరుణ కాంగ్రెస్ తరుపున బరిలో నిలిచారు.