బీఆర్ఎస్‌కు షాక్.. మరో ముఖ్య నేత జంప్ !
X
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో ప్రధాన పార్టీల్లోకి చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. గద్వాల జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీఆర్ఎస్ నాయకత్వానికి ఫ్యాక్స్ ద్వారా పంపారు. దిల్లీలో ఏఐసీసీ పెద్దల సమక్షంలో గురువారం సరిత కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గత కొద్ది రోజులుగా జడ్పీ చైర్ పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య కాంగ్రెస్ లో చేరతారని వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని ఆమె ఖండిస్తూ వచ్చారు. చివరికి ఊహాగానాలు ప్రకారమే బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.
గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో గత కొంత కాలంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి , జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితకు మధ్య గ్యాప్ కొనసాగుతుంది. ఈ పరిణామాలతో బీఆర్ఎస్‌ను వీడాలని సరిత నిర్ణయించుకున్నారు. సరిత దంపతులతో జూపల్లి కృష్ణారావు చర్చల జరిపి కాంగ్రెస్లో చేరేందుకు ఒప్పించారు. త్వరలోనే ప్రియాంకగాంధీ సమక్షంలో జూపల్లి పార్టీలో చేరనున్నారు. ఈ నెల 20 కొల్లాపూర్లో సభను నిర్వహించాలని కాంగ్రెస్ భావించింది. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ సభను వాయిదా వేశారు.ఈ నెల 30వ తేదీన ఈ సభను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ సభలోనే జూపల్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారు.